నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

శ్రీ దేవీ నవరత్న మాలిక


హార నూపుర కిరీట కుండల విబూషితా2వయవ శోభినీం
కారణేశ వరమౌలికోటి పరికల్ప్య మాన పదపీఠికాం
కాల కాల ఫణి పాశబాణ ధనురంకుశా మరుణమేఖలాం
ఫాల భూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతాం

గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం
సాంధ్యరాగ మధురా2ధరా2భరణ సుందరానన శుచిస్మితాం
మంథరా2యత విలోచనా మమల బాలచంద్ర కృతశేఖరీం
ఇందిరా రమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం





స్మేర చారుముఖ మండలాం విమలగండలంబి మణికుండలాం
హారదామ పరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీర గర్వహర నూపురాం వివిధకారణేశ వరపీఠికాం
మారవైరి సహచారిణిం మనసి భావయామి పరదేవతాం

భూరిభార ధరకుండలీంద్ర మణిబద్ధ భూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణిం
వారి సారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం







కుండల త్రివిధకోణ మండల విహార షడ్దళ సముల్లసత్
పుండరీక ముఖవేదినీం తరుణ చండభాను తటిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితా2మృత తరంగిణీ మరుణ రూపిణీం
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం

వారణా2నన మయూరవాహముఖ దాహవారణా పయోధరాం
చారణా22ది సురసుందరీ చికుర శేఖరీకృత పదాంబుజాం
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం
వారణాంత ముఖపారణాం మనసి భావయామి పరదేవతాం






పద్మకాంతి పదపాణిపల్లవ పయోధరా22నన సరోరుహాం
పద్మరాగ మణిమేఖలా వలయనీ విశోభిత నితింబినీం
పద్మసంభవ సదా శివాంతమయ పంచరత్న పదపీఠికాం
పద్మినీం ప్రణవ రూపిణీం మనసి భావయామి పరదేవతాం

 
ఆగమ ప్రణవపీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం
ఆగమా2వయవ శోభినీ మఖిలవేద సారకృత శేఖరీం
మూలమంత్ర ముఖ మండలాం ముదిత నాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం

 
కాలికా తిమిర కుంత లాంత ఘన భృంగ మంగళ విరాజినీం
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం
కాళికా మధుర గండమండల మనోహరా 2 2నన సరోరుహాం
కాళికా మఖిల నాయకీం మనసి భావయామి పరదేవతాం

 
నిత్య మేవ నియమేన జల్పతాం భుక్తి ముక్తి ఫలదా మభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేత్ నామరత్న నవరత్న మాలికం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి