నా గురించి

నా ఫోటో
ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.

వేద గణపతి : మహాగణపతి

గణపతి 

           గణపతి తెలియని భారతీయుడు ఉండడు. గణపతి పేరు వినగానే అందరకి గుర్తు వచ్చే రూపం ఏనుగు తల(గజముఖం),పెద్ద పొట్ట (లంబోదరం) మరుగుజ్జు (వికట). మన అందరికి గణపతి శివ పార్వతుల తనయుడుగ తెలుసు . 

   ఇంకా బ్రహ్మాండ పురాణం లోని లలితా సహస్రనామ స్తోత్రం లోని ఒక నామం " కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా " అని అమ్మవారు ఈశ్వరుని ముఖం చూడటం ద్వారా గణపతిని ఉద్బవింప చేసి విఘ్నయంత్ర   చేదన  చేసిందని  ఉన్నది. ఇవి కాక గణపతిని పార్వతిదేవికి గోలోక వాసుడైన శ్రీ కృష్ణుని వరంగా జన్మించాడని ఇంకా ఎన్నో కధనాలు మనం వివిధ పురాణాలలో గమనించవచ్చు.  ప్రతి గాధ మనకు ఒక సందేశాన్ని తెలుపుతుంది ఈ గాధలను తెలుసుకునే ముందు శివ మహా పురాణం లో  ఒక విచిత్ర సంఘటన గమనించవచ్చు

            పార్వతి పరమేశ్వరుల కల్యాణంలో బ్రహ్మ పురోహితునిగా ఉండి కళ్యాణ క్రతువును గణపతి పూజతో ప్రారంభించాడట. దీనిని బట్టి గణపతి శివ పార్వతుల కన్నా పూర్వం  ఒక  గణపతి ఉన్నాడని  తెలుస్తుంది.

 తరువాత పార్వతి పరమేశ్వరులకు ఒక గణపతి కలిగాడని స్కాంద పురాణం లోని వినాయక వ్రతకల్పం తెలుపుతుంది. దీనినే మనం వినాయక వ్రతలల్పం లో చదువుకుంటున్నాం. ప్రతి పురాణం వేద ప్రతిపాదితమైన గణపతి మూల తత్వాన్నే ప్రతిబిమ్బిస్తున్నది. బ్రహ్మ ప్రథమంగా పూజించింది ఆ మూల తత్వాన్నే. వేదం లో తెలిపిన ఆ గణపతి మూల తత్వాన్ని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

           గణపతి మూల తత్వాన్నే మహాగణపతిగా వేద సంభోదించింది. అటువంటి మహాగణపతి గురించి తెలుసుకునే ముందు దానిని తెలుసుకోవటానికి గల ఆవశ్యకతను తెలుసుకుందాం

           హైందవ సాంప్రదాయంలో ప్రతి కార్యక్రమానికి ముందు గణపతి పూజ చేయడం అందరికి తెలిసిందే, గణపతిపూజ లో ఒక పసుపు ముద్దను గణపతిగా భావించి పూజ చేస్తుంటారు. దీని వరకు ఎవరికీ గణపతి గురించి ఏవిదమైన ఆలోచన రాదు. కాని నా చిన్నతనంలో ఒక సందేహం వచ్చింది. వినాయక చవితి రోజున గణపతి పూజ సమయంలో వినాయక వ్రతకల్పం లో  మహా గణపతి పూజ అనంతరం సిద్ది వినాయక పూజ తెలపబడుతుంది. గణపతి, వినాయకుడు ఒక్కరే ఐనప్పుడు పెద్ద ఆకారంలో ఉండి తొండం, చతుర్భుజాలు, మూషిక వాహనం ఇత్యాదులు కలిగిన మట్టి తో చేసిన అసలు వినాయకుని వదలి ముందు, ఏ ఆకారం లేని పసుపుముద్దను పూజించటం లో గల అంతర్యాన్ని తెలుసుకోవటం ద్వారా వినాయకునికి మహాగణపతికి భేదాన్ని, సంభదాన్ని మహా గణపతి ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చు. మహా గణపతి గురించి వేదం లోని గణపతి మంత్రాలూ, గణపతి  అధర్వశీర్ష ఉపనిషత్తు విపులంగా తెలుపుతున్నాయి.

              ఋగ్వేదం లోని గణపతి సూక్తం లో మనం ఒక మంత్రాన్ని గమనించవచ్చు


           . ఈ మంత్రం గణపతిని " బ్రహ్మణస్పతి " అని సంభోదిన్చిది. ఈ మంత్ర నేపద్యాన్ని గమనిస్తే త్వష్ట పేరు  ధరించినటువంటి పరబ్రహ్మ సృష్టి లోని సమస్త గణాలకు అధిపతిగా బ్రహ్మణస్పతి నామం తో గణపతిని సృష్టించాడని వేదం తెలుపుతుంది.దీనిని బట్టి మనం విశ్వం లోని ఏ గణాన్ని తీసుకొన్నా అంటే దేవ గణాలకు మానవ, రాక్షస, జంతు గణాలకు, సూర్య, నక్షత్ర, గ్రహ గణాలకు ప్రతి గణానికి గణపతి గణాధిపతిగా ఉంటాడు.  

     గణేశ ఉపనిషత్ గణపతిని సృష్టి ఆది లో ఆవిర్భవించినవానిగా తెలిపింది 

      ఈ మంత్రం చివరలో గణపతిని సృష్టి ఆది లో ఆవిర్భవించినవానిగా ప్రకృతి పురుషులకంటే ముందు ఉన్నవాడిగా తెల్పింది. అంతేకాక ఈ జగత్తు సర్వం ఆయనలోనే జన్మించి, ఆయనలోనే ఉంది , ఆయనలోనే లయమవుతుంది అని, సమస్త దేవతల రూపాలు గణపతివే అని తెలిపింది. అంతేకాక గణపతిని త్రికాలకు త్రిగుణాలకు అతీతునిగా తెల్పింది. మరిన్ని విషయాలకు  గణపత్యథర్వ శీర్షోపనిషత్  లింకును చూడండి. 

               గణపతి నాలుగు యుగాలలో నాల్గు అవతారాలలో  ఉంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది 

కృత యుగం : మహోత్కట / వినాయక నామం : 10 భుజాలు : సింహ వాహనం : అదితి కశ్యపుల పుత్రుడు 

త్రేతా యుగం : మయూరేశ్వర నామం : 6 భుజాలు : నెమలి వాహనం : శివ పుత్రుడు 

ద్వాపర యుగం : గజానన నామం : 4 భుజాలు : ఎలుక వాహనం : శివ పుత్రుడు

కలి యుగం : ధూమకేతు / శూర్ప కర్ణ  నామం : 2 భుజాలు : గుర్రం వాహనం

         కలియుగంలో గణపతి అవతారం జరగలేదు కాబట్టి ముందు యుగమైన ద్వాపర యుగ గణపతి అవతరాన్నే పూజించాలని  వినాయక వ్రతకల్పం ద్వాపర యుగ కథనే వ్రతకథగా తెలుపుంది. 

                 అంతే కాక వేదం గణపత్యథర్వ శీర్షోపనిషత్

 గణపతిని "త్వం మూలాధార స్థితో సి నిత్యం " ప్రస్తావించింది. షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రం గణపతి స్థానంగా చెప్పబడింది మూలాధార చక్రాదిపతి గణపతి  తత్వం విఘ్నేశ్వరునిగా ఈ బ్లాగ్ లోనే నా నాద గణపతి వ్యాసంలో విస్తృతం గా చెప్పబడింది . గమనించ గలరు 

ఈ పోస్ట్ పై  మీ విలువైన సలహాలకు సవరణలు, సందేహాలకు వివరణలు తప్పకుండా ఉంటాయి 
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram 

- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి